శ్రావణ బహుళ అమావాస్యను 'పొలాల అమావాస్య' అంటారు. పొలాల అమావాస్యకు హిందు సాంప్రదాయంలో ఎంతో విశిష్టత వుంది. స్త్రీలు తమ సౌభాగ్యం కోసం, తమ పిల్లల యోగ, క్షేమాల కోసం, తమ కుటుంబంకోసం వ్రతాలు ఆచరించడం మనకు అనాది నుంచి వస్తున్న ఆచారం. ఈ 'పోలాల అమావాస్య వ్రతం' ప్రత్యేకంగా సంతాన సంరక్షణ కోసం నిర్ధేశించబడినది. పెళ్లయి చాలాకాలమయినా సంతానం కలుగని స్త్రీలు, సంతానవతులైన స్త్రీలు ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి.
ఈ రోజే శనిఅమావాస్య కూడా. శనివారం తో కూడిన అమావాస్యను , శనిఅమావాస్య అని అంటారు. ఈ రోజు శనైశ్వర అమావాస్య ఉపవాసం చేయాలి. ఈ రోజు శనిదేవుడిని శాస్త్రోక్తంగా పూజించాలి. శనిదేవాలయానికి వెళ్లి నువ్వుల నూనె, నల్ల నువ్వులు తో అభిషేకం చేసి పూజించాలి. మల్లెపూవులు, దీపదానం, నువ్వుల నూనె, బట్టలు ఇతర వస్తువలను దానం చేయాలి. దీంతో శని దేవుడు కరుణిస్తాడు.. ఈ రోజు హనుమాన్ చాలీసా, సుందర కాండ పఠించడం వల్ల శనిదోషం కలుగదు.
శ్రావణ బహుళ అమావాస్య |
|
Date | August 27, 2022, Saturday |
Tithi | Shravana Amavasya, Polala Amavasya, Shani Amavasya |
Tithi Time | Aug 26, 12:25 PM - Aug 27, 1:47 PM |
గమనిక: ఈ అమావాస్య తేదీలు తిథి సమయాలు భారత ప్రభుత్వం గుర్తించిన "కాలచక్రం గంటల పంచాంగం" నుండి సేకరించాము. ఆంద్రా, తెలంగాణ రాష్టలలో అన్ని ప్రాంతాల వారికి ఈ సమయాలు వర్తిస్తాయి. భారతదేశంలో ఇతర రాష్ట్రాలలో కూడా 1 లేదా 2 నిమిషాల తేడా మాత్రమే ఉంటుంది.