Advertisment

కార్తీక అమావాస్య 2022

Kartika Amavasya 2022

కార్తీక బహుళ అమావాస్య 2022

కార్తీక బహుళ అమావాస్యతో కార్తీకమాసం ముగిసిపోతుంది కనుక, ఈ రోజున దైవారాధనలో మరింతసేపు గడపడానికి ప్రయత్నించాలి. ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టడం వలన మాసమంతా ఉపవాసాన్ని ఆచరించిన ఫలితం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ రోజున తెల్లవారుజామునే కార్తీకస్నానం చేసి ఇంట్లో తులసికోట వద్ద దీపం వెలిగించాలి. తరువాత శివాలయానికి గానీ, విష్ణాలయానికి గానీ వెళ్ళి ఆవునేతితో రెండు దీపాలను ఆలయం వద్ద వెలిగించి స్వామి దర్శనం చేసుకోవాలి. అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఆవునేతి దీపాలు వెలిగించి  మహాలక్ష్మిని ఆరాధించినట్లయితే లక్ష్మీకటాక్షం తప్పక కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

కార్తీక బహుళ అమావాస్య

Date November 23, 2022, Wednesday
Tithi Kartika Amavasya
Tithi Time Nov 23, 6:54 AM - Nov 24, 4:28 AM

గమనిక: ఈ అమావాస్య తేదీలు తిథి సమయాలు భారత ప్రభుత్వం గుర్తించిన "కాలచక్రం గంటల పంచాంగం" నుండి సేకరించాము. ఆంద్రా, తెలంగాణ రాష్టలలో అన్ని ప్రాంతాల వారికి ఈ సమయాలు వర్తిస్తాయి. భారతదేశంలో ఇతర రాష్ట్రాలలో కూడా 1 లేదా 2 నిమిషాల తేడా మాత్రమే ఉంటుంది.