Advertisment

మాస శివరాత్రి 2022 తేదీలు మరియు తిథి సమయం

Masa Shivaratri Calendar 2022

మాస శివరాత్రి 2022 తేదీలు మరియు తిథి సమయం

ప్రతి నెలలోను వచ్చే బహుళ చతుర్దశిని మాస శివరాత్రి అంటారు. మాస శివ రాత్రి. ప్రతి నెలా వచ్చే మన శివుని పండుగ. శివుని జన్మ తిథిని అనుసరించి ప్రతి నెలా కృష్ణ పక్షం చతుర్దశి నాడు ఆ భోళా శంకరుని ఉద్దేశించి చేసుకునే పూజ. ఈ రోజున ఉపవాసం, ప్రదక్షిణాలు ప్రత్యేకముగా, విశిష్టముగా ఉంటాయి.అలా సంవత్సరంలో పన్నెండు మాస శివరాత్రులు వస్తే అందులో గొప్పదైన ఈ శివరాత్రి అంటే మాఘ మాస శివరాత్రిని మహా శివరాత్రి అంటారు. 

అసలు ఈ రోజున ఏం చేయాలి?

శివుడికి ఈ రోజును ప్రీతి పాత్రమైన రోజుగా చెపుతారు. ఈ రోజున శివుడికి అభిషేకాలు, పూజలు చేయడం వలన కోరిన కోర్కెలు నెరవేరుతాయి అని ప్రతీతి. ఉదయం కాని సాయంకాలం శివునికి అభిషేకం చేయాలి. తరువాత పాయసాన్ని నివేదన చేయాలి.

ఉపవాసం ఉండదలచిన వారు ఉదయం నుంచి ఉపవాసం ఉండి శివనామ స్మరణ చేస్తూ సాయంకాలం ప్రదోష సమయంలో శివునికి అభిషేకం చేయాలి. విష్ణువుకి అలంకారం అంటే ప్రీతి. శివునికి అభిషేకం అంటే ప్రీతి. కావున శివునికి రుద్రంతో కాని, నమక, చమకాలతో కాని ఈ రోజున అభిషేకం చేయాలి. అలాగే ప్రదోష పూజలు అన్నా కూడా శివుడికి చాలా ప్రీతికరం. అభిషేకానంతరం, బిల్వాష్టోత్తరం చెపుతూ బిల్వ దళాలను శివునికి అర్పించాలి. ఇవి ఏవీ చేయకున్నా కనీసం ఉదయం నుంచి ఉపవాసం ఉండి, సాయంకాలం శివాలయానికి వెళ్ళి దీపారాధన చేసి పంచాక్షరీ మంత్రమైన ఓం నమః శివాయను జపించడం కూడా మంచిది. ఎవరి స్తోమతను అనుసరించి వారు పరిహారాలు చేసుకోవాలి.

ప్రదోషకాలంలో శివుడు తాండవం చేస్తూ ఉంటారని పురాణ వచనం. ఈ సమయంలో పార్వతీదేవి బంగారు సింహాసనంపై ఆసీనురాలై ఉంటుందట. లక్ష్మీదేవి పాట పడుతూ ఉంటే శ్రీ మహావిష్ణువు మద్దెల వాయిస్తూ ఉంటాడు. మొత్తం త్రిమూర్తులు అందరూ ఒకేచోట ఈ సమయంలో ఉంటారని చెపుతారు.

కావున ఈ ప్రదోషకాలంలో శివుని నామాన్ని స్మరించినా ఆయనకి పూజాభిషేకాలు నిర్వహించినా మహా పుణ్యమనీ మనోభీష్టాలు నెరవేరుతాయనీ చెప్పబడుతోంది. అందువలన మహాశివరాత్రి రోజున ఉపవాస, జాగారాలు చేయాలనే నియమాన్ని పాిస్తూ ప్రదోష కాలంలో శివుని ఆరాధించాలి. ఒకవేళ ఏ సందర్భంలోనైనా మహా శివరాత్రినాడు చేయాలనుకున్న పనులు  చేయలేకపోయినా ఈ పన్నెండు మాస శివరాత్రులలో ఏ శివరాత్రికైనా ఈ పనులు చేయడం వలన మంచి ఫలితాలను పొందుతారు.

మాస శివరాత్రి డేట్స్ అండ్ తిథి టైమ్ 

Margashira Krishna Chaturdashi

Date January 1, 2022, Saturday
Shivaratri Puja Time Jan 02, 12:03 AM - Jan 02, 12:57 AM
Importance Masa Shivaratri
Tithi Time Jan 01, 7:17 am - Jan 02, 3:42 am

Pausha Krishna Chaturdashi

Date January 30, 2022, Sunday
Shivaratri Puja Time Jan 31, 12:13 AM - Jan 31, 1:05 AM
Importance Masa Shivaratri
Tithi Time Jan 30, 5:29 pm - Jan 31, 2:19 pm

Magha Krishna Chaturdashi / Maha Shivaratri

Date March 1, 2022, Tuesday
Shivaratri Puja Time Mar 02, 12:13 AM - Mar 02, 1:03 AM
Importance Maha Shivaratri
Tithi Time Mar 30, 1:20 pm - Mar 31, 12:23 pm

Phalguna Krishna Chaturdashi

Date March 30, 2022, Wednesday
Shivaratri Puja Time Mar 31, 12:07 AM - Mar 31, 12:54 AM
Importance Masa Shivaratri
Tithi Time Mar 30, 1:20 pm - Mar 31, 12:23 pm

Chaitra Krishna Chaturdashi

Date April 29, 2022, Friday
Shivaratri Puja Time Apr 30, 12:01 AM - Apr 30, 12:46 AM
Importance Masa Shivaratri
Tithi Time Apr 29, 12:27 am - Apr 30, 12:58 am

Vaishakha Krishna Chaturdashi

Date May 28, 2022, Saturday
Shivaratri Puja Time May 29, 12:02 AM - May 29, 12:45 AM
Importance Masa Shivaratri
Tithi Time May 28, 1:10 pm - May 29, 2:56 pm

Jyeshtha Krishna Chaturdashi

Date June 27, 2022, Monday
Shivaratri Puja Time Jun 28, 12:08 AM - Jun 28, 12:51 AM
Importance Masa Shivaratri
Tithi Time Jun 27, 3:26 am - Jun 28, 5:53 am

Ashadha Krishna Chaturdashi

Date July 26, 2022, Tuesday
Shivaratri Puja Time Jul 27, 12:11 AM - Jul 27, 12:55 AM
Importance Masa Shivaratri
Tithi Time Jul 26, 6:48 pm - Jul 27, 9:12 pm

Shravana Krishna Chaturdashi

Date August 25, 2022, Thursday
Shivaratri Puja Time Aug 26, 12:06 AM - Aug 26, 12:52 AM
Importance Masa Shivaratri
Tithi Time Aug 25, 10:38 am - Aug 26, 12:25 pm

Bhadrapada Krishna Chaturdashi

Date September 24, 2022, Saturday
Shivaratri Puja Time Sep 24, 11:55 PM - Sep 25, 12:43 AM
Importance Masa Shivaratri
Tithi Time Sep 24, 2:31 am - Sep 25, 3:13 am

Ashwayuja Krishna Chaturdashi

Date October 23, 2022, Sunday
Shivaratri Puja Time Oct 23, 11:46 PM - Oct 24, 12:36 AM
Importance Masa Shivaratri, Yama Tarpanam, Naraka Chaturdashi Puja, Dhanalakshmi Puja
Tithi Time Oct 23, 6:04 pm - Oct 24, 5:28 pm

Kartika Krishna Chaturdashi

Date November 22, 2022, Tuesday
Shivaratri Puja Time Nov 22, 11:46 PM - Nov 23, 12:39 AM
Importance Masa Shivaratri
Tithi Time Nov 22, 8:50 am - Nov 23, 6:54 am

Margashirsha Krishna Chaturdashi

Date December 21, 2022, Wednesday
Shivaratri Puja Time Dec 21, 11:58 PM - Dec 22, 12:51 AM
Importance Masa Shivaratri
Tithi Time Dec 21, 10:17 pm - Dec 22, 7:14 pm

గమనిక: ఈ మాస శివరాత్రి తేదీలు తిథి సమయాలు భారత ప్రభుత్వం గుర్తించిన "కాలచక్రం గంటల పంచాంగం" నుండి సేకరించాము. ఆంద్రా, తెలంగాణ రాష్టలలో అన్ని ప్రాంతాల వారికి ఈ సమయాలు వర్తిస్తాయి. భారతదేశంలో ఇతర రాష్ట్రాలలో కూడా కొద్ది సెకనుల తేడా మాత్రమే ఉంటుంది.