ఆశ్వయుజ అమావాస్య 2022

Ashwayuja Amavasya 2022

ఆశ్వయుజ బహుళ అమావాస్య 2022

ఆశ్వయుజ అమావాస్య రోజునే దీపావళి పండగ. లక్ష్మీదేవికి ఇష్టమైన నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తే అమ్మ అనుగ్రహం లభిస్తుంది. గుమ్మం, తులసి దగ్గర మాత్రం తప్పనిసరిగా మట్టి ప్రమిదలో నువ్వుల నూనె లేదా ఆవు నేతితో దీపాలు వెలిగించాలి. ప్రదోష సమయంలోనే లక్ష్మి దేవి పూజ చేస్తారు. ధనలక్ష్మి పూజ ఈ రోజు చేస్తే ధన ధాన్యాలు, అష్టైశ్వర్యాలు సంప్రాప్తిస్తాయి. 

ఈ రోజే కేదార వ్రతాన్ని చేసుకుంటారు.ఈ నోమును సాక్షాత్తు పార్వతీదేవే నోచిందని, పరమేశ్వరుడి అనుగ్రహం పొందిందని పురాణోక్తి. గౌతమ మహర్షి చెప్పిన విధి విధానాలను అనుసరించి పార్వతీ దేవి కేదారేశ్వర వ్రతాన్ని ఆశ్వీయుజ మాసంలో శుక్లపక్షంలో అష్టమినాడు మొదలుపెట్టి అమావాస్య వరకు ఆచరించినట్టుగా చెబుతారు. ఈ వ్రతాన్ని స్త్రీలు చాలా వరకు దీపావళి అమావాస్య రోజున ఉపవాస దీక్షతో భక్తిశ్రద్ధలతో గౌరీ సమేత కేదారేశ్వరుడిని పూజించి, ఆ ఆది దంపతుల కృపను పొందుతుంటారు. 

ఆశ్వయుజ బహుళ అమావాస్య

Date October 25, 2022, Tuesday
Tithi Ashwayuja Amavasya, Dipavali Amavasya, Kedara Vratham, Akasa Deepam Prarambam
Tithi Time Oct 24, 5:28 PM - Oct 25, 4:19 PM

గమనిక: ఈ అమావాస్య తేదీలు తిథి సమయాలు భారత ప్రభుత్వం గుర్తించిన "కాలచక్రం గంటల పంచాంగం" నుండి సేకరించాము. ఆంద్రా, తెలంగాణ రాష్టలలో అన్ని ప్రాంతాల వారికి ఈ సమయాలు వర్తిస్తాయి. భారతదేశంలో ఇతర రాష్ట్రాలలో కూడా 1 లేదా 2 నిమిషాల తేడా మాత్రమే ఉంటుంది.