భాద్రపద బహుళ అమావాస్యని మహాలయ అమావాస్య అంటారు. ఈ సర్వప్రీతి అమావాస్య అని కూడా అంటారు. పూర్వకాలం నుంచి ఈ రోజును శ్రాద్ధానికి చివరిరోజుగా నమ్ముతారు. ఈ సర్వ పితృ అమావాస్యనాడు మనకు తెలిసిన, తెలియని పూర్వీకుల కోసం శ్రాద్ధం నిర్వహించడం ప్రత్యేకం. అంటే ముఖ్యంగా తమ బంధువులు ఏరోజు మరణించారో తెలియని వారు ఈ రోజు వారి పేరు మీద తర్పణం లేదా శ్రాద్ధం కూడా చేయవచ్చు. ఈ పర్వదినం రోజున శివున్ని భక్తిశ్రద్దలతో కొలుస్తారు, ఇలా చేస్తే కీర్తి ప్రతిష్టలు పొదుతారాని నమ్మకం ఉంది. అంతే కాదు భక్తి శ్రద్దలతో పూజిస్తే జీవితంలని కష్టాలన్నీ తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.
భాద్రపద బహుళ అమావాస్య |
|
Date | September 25, 2022, Sunday |
Tithi | Bhadrapada Amavasya, Mahalaya Amavasya, Batukamma Panduga Prarambam |
Tithi Time | Sep 25, 3:13 AM - Sep 26, 3:24 AM |
గమనిక: ఈ అమావాస్య తేదీలు తిథి సమయాలు భారత ప్రభుత్వం గుర్తించిన "కాలచక్రం గంటల పంచాంగం" నుండి సేకరించాము. ఆంద్రా, తెలంగాణ రాష్టలలో అన్ని ప్రాంతాల వారికి ఈ సమయాలు వర్తిస్తాయి. భారతదేశంలో ఇతర రాష్ట్రాలలో కూడా 1 లేదా 2 నిమిషాల తేడా మాత్రమే ఉంటుంది.