Advertisment

ఏప్రిల్ 2023 సూర్య గ్రహణం పట్టు విడుపు సమయాలు

ఈ సంవత్సరం అంటే 2023 సం లో గ్రహణం  Apr 20, 2023 , Friday రోజు వచ్చింది. గ్రహణం కనిపించే ప్రాంతాలు - South/East Asia, Australia, Pacific, Indian Ocean, Antarctica. ఇండియా లో. ముక్యంగా మన తెలుగు స్టేట్స్ లో ఎటువంటి ప్రభావం లేదు. కనుక ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం లేదు. గ్రహణం కనిపించే ప్రాంతాల్లో మీ పిల్లలు గాని ,బందువులు, స్నేహితులు ఉంటే ,వారు మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి.

panchangam:april-2023-total-solar-eclipse

April 2023 Total Solar Eclipse Date and Time, Visible Places

Date

Apr 20, 2001, Friday

Eclipse Start

Apr 20, 07:04 AM

Eclipse End

Apr 20, 12:29 PM

Regions seeing, at least, a partial eclipse

South/East Asia, Australia, Pacific, Indian Ocean, Antarctica.

Cities where eclipse is visible

  • Exmouth, Western Australia, Australia
  • Amsterdam Island, French Southern Territories
  • Port-aux-Francais, French Southern Territories, France
  • Perth, Western Australia, Australia
  • Jakarta, Jakarta Special Capital Region, Indonesia
  • Makassar, South Sulawesi, Indonesia
  • Dili, Timor-Leste
  • Darwin, Northern Territory, Australia
  • General Santos, Philippines
  • Manokwari, West Papua, Indonesia
  • Port Moresby, Papua New Guinea
  • Ngerulmud, Palau
  • Honiara, Solomon Islands
  • Hagåtña, Guam
  • Saipan, Northern Mariana Islands
  • Baker Island, US Minor Outlying Islands
  • Palikir, Pohnpei, Micronesia
  • Funafuti, Tuvalu
  • Yaren, Nauru
  • Tarawa, Kiribati
  • Majuro, Marshall Islands

Detailed eclipse path map

April 2023 Total Solar Eclipse

గ్రహణం సమయంలో, సూర్యుడు మేషం మరియు అశ్విని నక్షత్రంలో జరుగుతున్నాడు, 

కాబట్టి ఇది మేషరాశి వారి పై ఎక్కువ  ప్రభావాన్ని చూపుతుంది. మేషరాశి వారు గ్రహణ సమయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. దీనితో పాటు సింహ, కన్యా, వృశ్చిక, మకర రాశుల వారికి సూర్యగ్రహణం ఒడిదుడుకులు తెచ్చిపెడుతోంది. ఇది వృషభం, మిథునం, ధనుస్సు మరియు మీన రాశు లవారి పై శుభ ప్రభావాన్ని చూపుతుంది.

సూర్యగ్రహణ ప్రభావం ఎక్కువగా ప్రెగ్నెన్సీ మహిళలపై ఉంటుంది అందుకే ఈ సమయంలో గర్భిణులు కచ్చితంగా అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా గ్రహణం పట్టడానికి కనీసం 6 గంటలు ముందే భోజనం చేయాలి. గ్రహణం సమయంలో అస్సలు ఆహారం తీసుకోకూడదు. అలాగే వీరు నదీ తీరాన, సాగర తీరాన, ఎలాంటి సరస్సుల వద్ద స్నానం వంటివి చేయకూడదు. కేవలం ఇంట్లోనే స్నానం చేయాలి. అదీ గ్రహణం పూర్తయిన తర్వాతే.

సూర్య గ్రహణం సమయంలో ప్రెగ్నెన్సీ మహిళలు పడుకున్నప్పుడు అటు ఇటూ కదలకూడదు. ముఖ్యంగా పిండంలో ఉండే బేబీకి ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. గ్రహణం సమయంలో కుర్చీలో లేదా సోఫాలో ప్రశాంతంగా కూర్చొని ఏదైనా పుస్తకం చదవడం, TV చూడటం లేదా ఏవైనా తేలికగా ఉండే పనులు చేయాలి.

సూర్యగ్రహణం వేళ ప్రతిఒక్కరూ కచ్చితంగా ఉపవాసం ఉండాలని పండితులు చెబుతున్నారు. ఈ సమయంలో ఉపవాసం ఉండటం వల్ల శుభ ఫలితాలొస్తాయని చాలా మంది నమ్ముతారు.

గ్రహణం వేళ పంచాంగం చూడకూడదు. మూడేళ్ల చిన్నారులకు నదీ స్నానాలు, సాగర తీర స్నానం చేయించకూడదు. గ్రహణాన్ని ఎవ్వరూ నేరుగా చూడకూడదు. దీని వల్ల కంటి చూపు పోయే ప్రమాదం కూడా ఉంటుంది. గ్రహణం సమయంలో ఎక్కువ దూరం ప్రయాణం చేయకండి. 

 

 ఇంట్లోని వస్తువులకు, ఆహారం వంటి వాటిపై సూర్య  గ్రహణం ప్రభావం పడకుండా గరికను అన్ని చోట్ల ఉంచాలి.  దేవుని మందిరంలో కూడా ఆ గరికను ఉంచి దేవుడిని పూజించాలి. 

 

సూర్యగ్రహణము సమయంలో తలస్నానము ఆచరించడం (పట్టు విడుపు స్నానాలు చేయడం), సూర్య ఆరాధన చేసుకోవడం. రాహు జపం, దుర్గాదేవి ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు .  సూర్యగ్రహణము సమయములో  ధ్యానము చేస్తే విశేషమైన  ఫలితములుంటాయి. గ్రహణం విడిచిన తర్వాత ఇల్లు, దేవుని మందిరం శుభ్రం చేసుకోవాలి.