శ్రీ సాయి నక్షత్ర మాలికా
షిరిడీసదనా శ్రీసాయీ
సుందర వదనా శుభధాయీ
జగత్కారణా జయసాయీ
నీ స్మరణే ఎంతో హాయీ || 1 ||
శిరమున వస్త్రము చుట్టితివీ
చినిగిన కఫినీ తొడిగితివీ
ఫకీరువలె కనిపించితివీ
పరమాత్ముడవనిపించితివీ || 2 ||
చాందుపాటేలుని పిలిచితివీ
అశ్వము జాడ తెలిపితివీ
మహల్సాభక్తికి మురిసితితివీ
సాయని పిలిచితె పలికితివీ || 3 ||
గోధుమ పిండిని విసరితివీ
కలరా వ్యాధిని తరిమితివీ
తుఫాను తాకిడి నాపితివీ
అపాయమును తప్పించితివీ || 4 ||
అయిదిళ్లలో భిక్షడిగితివీ
పాపాలను పరిమార్చితివీ
బైజాసేవను మెచ్చితివీ
సాయుజ్యమునూ ఇచ్చితివీ || 5 ||
నీళ్ళను నూనెగ మార్చితివీ
దీపాలను వెలిగించితివీ
సూకరనైజం తెలిపితివీ
నిందలు వేయుట మాన్పితివీ || 6 ||
ఊదీ వైద్యము చేసితివీ
వ్యాధులనెన్నో బాపితివీ
సంకీర్తన చేయించితివీ
చిత్తశాంతి చేకూర్చితివీ || 7 ||
అల్లా నామము పలికితివీ
ఎల్లరి క్షేమము కోరితివీ
చందనోత్సవము చేసితివీ
మతద్వేషాలను మాపితివీ || 8 ||
కుష్ఠురోగినీ గాంచితివీ
ఆశ్రయమిచ్చీ సాకితివీ
మానవధర్మం నెరిపితివీ
మహాత్మునిగ విలసిల్లితివీ || 9 ||
ధునిలో చేతిని పెట్టితివీ
కమ్మరిబిడ్డను కాచితివీ
శ్యామా మొర నాలించితివీ
పాము విషము తొలిగించితివీ || 10 ||
జానెడు బల్లను ఎక్కితివీ
చిత్రముగా శయనించితివీ
బల్లి రాకను తెలిపితివీ
సర్వజ్ఞుడవనిపించితివీ || 11 ||
లెండీ వనమును పెంచితివీ
ఆహ్లాదమునూ పంచితివీ
కర్తవ్యము నెరిగించితివీ
సోమరితనమును తరిమితివీ || 12 ||
కుక్కను కొడితే నొచ్చితివీ
నీపై దెబ్బలు చూపితివి
ప్రేమతత్వమును చాటితివీ
దయామయుడవనిపించితివీ || 13 ||
అందరిలోనూ ఒదిగితివీ
ఆకాశానికి ఎదిగితివీ
దుష్టజనాళిని మార్చితివీ
శిష్టకోటిలో చేర్చితివీ || 14 ||
మహల్సా ఒడిలో కొరిగితివీ
ప్రాణాలను విడనాడితివీ
మూడు దినములకు లేచితివీ
మృత్యుంజయుడనిపించితివీ || 15 ||
కాళ్ళకు గజ్జెలు కట్టితివీ
లయ బద్ధముగా ఆడితివీ
మధుర గళముతో పాడితివీ
మహదానందము కూర్చితివీ || 16 ||
అహంకారమును తెగడితివీ
నానావళినీ పొగడితివీ
మానవసేవా చేసితివీ
మహనీయుడవనిపించితివీ || 17 ||
దామూ భక్తికి మెచ్చితివీ
సంతానమునూ ఇచ్చితివీ
దాసగణుని కరుణించితివీ
గంగాయమునలు చూపితివీ || 18 ||
పరిప్రశ్నను వివరించితివీ
నానాహృది కదిలించితివీ
దీక్షితుని పరీక్షించితివీ
గురుభక్తిని ఇల చాటితివీ || 19 ||
చేతిని తెడ్డుగ త్రిప్పితివీ
కమ్మని వంటలు చేసితివీ
ఆర్తజనాళిని పిలిచితివీ
ఆకలి బాధను తీర్చితివీ || 20 ||
మతమును మార్చితె కసరితివీ
మతమే తండ్రని తెలిపితివీ
సకల భూతదయ చూపితివీ
సాయి మాతగా అలరితివీ || 21 ||
హేమాదును దీవించితివీ
నీదు చరిత వ్రాయించితివీ
పారాయణ చేయించితివీ
పరితాపము నెడబాపితివీ || 22 ||
లక్ష్మీబాయిని పిలిచితివీ
తొమ్మిది నాణెములిచ్చితివీ
నవవిధ భక్తిని తెలిపితివీ
ముక్తికి మార్గము చూపితివీ || 23 ||
బూటీ కలలో కొచ్చితివీ
ఆలయమును కట్టించితివీ
తాత్యా ప్రాణము నిలిపితివీ
మహాసమాధీ చెందితివీ || 24 ||
సమాధి నుండే పలికితివీ
హారతినిమ్మని అడిగితివీ
మురళీధరునిగ నిలిచితివీ
కరుణామృతమును చిలికితివీ || 25 ||
చెప్పినదేదో చేసితివీ
చేసినదేదో చెప్పితివీ
దాసకోటి మది దోచితివీ
దశదిశలా భాసిల్లితివీ || 26 ||
సకల దేవతలు నేవెనయా
సకల శుభములను కూర్చుమయా
సతతమునిను ధ్యానింతుమయా
సద్గురు మా హృదినిలువుమ్మయా || 27 ||
సాయీ నక్షత్రమాలికా
భవరోగాలకు మూలికా
పారాయణ కిది తేలికా
ఫలమిచ్చుటలో ఏలికా
అర్థం
“శ్రీ సాయి నక్షత్ర మాలికా” అనేది శ్రీ శిరిడీ సాయిబాబా దివ్యచరిత్రను నక్షత్రాల్లా మాలగా అల్లిన కీర్తి గీతం.
ప్రతి శ్లోకం సాయిబాబా లీలలను, ఆయన భక్తులపై చూపిన దయను, జ్ఞానాన్ని, మరియు మానవతా సందేశాన్ని వర్ణిస్తుంది.
ఈ స్తోత్రం బాబా యొక్క జీవితం ఒక విశ్వగ్రంథమని, ఆయన ప్రతి చర్యలో దైవమర్మముందని మనకు గుర్తు చేస్తుంది.
బాబా చూపిన దయామూర్తి రూపాలు — వ్యాధులను నశింపజేయడం, భక్తులను రక్షించడం, మతసమానత్వాన్ని బోధించడం, ప్రేమతత్వాన్ని ప్రచారం చేయడం — ఈ స్తోత్రంలో అందంగా ప్రతిబింబించబడ్డాయి.
సాయి నామస్మరణతో ఈ మాలికను పఠిస్తే మనసు ప్రశాంతమవుతుంది, భక్తి పరాకాష్టకు చేరుతుంది.
• ఫలప్రదత:
🔸 మానసిక శాంతి, భక్తి స్థిరత్వం
🔸 సాయి కటాక్షం మరియు దైవ రక్షణ
🔸 కర్మశుద్ధి మరియు పాప విమోచనం
🔸 కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం, ఐశ్వర్యం
🔸 సద్గురు మార్గదర్శకత్వం మరియు ఆత్మజ్ఞానం
• పఠన విధానం:
- ఈ స్తోత్రం గురువారం లేదా సాయిబాబా ఆరాధన దినాల్లో పఠించడం అత్యంత శ్రేయస్కరం.
- దీపం వెలిగించి, సాయిబాబా విగ్రహం లేదా చిత్రముందు భక్తితో పఠించాలి.
- పఠనాంతరం “శ్రీ సాయినాథ మహారాజ్ కి జై” అని ముగించాలి.
• ఆధ్యాత్మిక భావం:
ఈ మాలికలో సాయిబాబా జీవితంలోని ప్రతీ లీలా — సద్గురు జ్ఞానం, మతసమానత్వం, కరుణ, మరియు ప్రేమతత్త్వం — నిత్య మంగళ స్వరూపంగా ప్రతిధ్వనిస్తుంది.
సాయి భక్తుని జీవితం ఈ నక్షత్రమాలికలాగే ప్రకాశించాలనే సంకల్పం దీనిలో దాగి ఉంది.
తరచుగా అడిగే ప్రశ్నలు
శ్రీ సాయి నక్షత్ర మాలికా అంటే ఏమిటి?
ఈ స్తోత్రాన్ని ఎప్పుడు మరియు ఎలా పఠించాలి?
శ్రీ సాయి నక్షత్ర మాలికా పఠించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?
ఈ స్తోత్రాన్ని ఎవరు పఠించవచ్చు?
ఈ స్తోత్రాన్ని ఎన్ని సార్లు పఠించాలి?
ఈ స్తోత్రం యొక్క మూలం ఏమిటి?
వ్యాఖ్యలు
వ్యాఖ్య రాయడానికి లాగిన్ అవ్వండి
వ్యాఖ్యలు లోడ్ అవుతున్నాయి...

