ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢ శుద్ధ నవమి వరకు రాత్రి సమయంలో వారాహీ అమ్మవారిని పూజిస్తారు.వీటిని గుప్తనవరాత్రులు అంటారు.
నాలుగు ముఖ్య మయిన నవరాత్రులలో ఆషాఢంలో వచ్చే వారాహి నవరాత్రి ఒకటి.
వారాహీ అమ్మవారు అంటే భూదేవి.హిరణ్యాక్షుడు భూదేవిని జలాల్లోకి తీసుకువెళ్ళినప్పుడు,శ్రీ మహావిష్ణువు వరాహరూపంలో అవతరించి,వాడిని సంహరించి,భూదేవిని రక్షిస్తాడు.స్వామివారి మీద భక్తి తో అప్పుడు అమ్మవారు వారాహీ రూపం తీసుకుందని, అందువలన ఈమె #వరాహస్వామి యొక్క స్త్రీ రూపమని కొన్ని ధ్యానశ్లోకాల్లో కనిపిస్తుంది.అంటే వారాహీ అమ్మవారు అంటే ఎవరో కాదు సర్వసంపదలను ఇచ్చే శ్రీ మహాలక్ష్మీ.అందుకే శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో వారాహీ ధరణీ ధ్రువా అని కనిపిస్తుంది. కాబట్టి ఈ అమ్మవారిని పూజిస్తే వరహాస్వామి లాగే అన్ని కోరికలను నెరవేర్చుతుంది. భూతగాదాలను నివారిస్తుంది, లేదా పరిష్కరిస్తుంది.
వారాహీ అమ్మవారు స్వరూపాన్ని గమనిస్తే వరాహ ముఖంతో, అష్ట భుజాలతో, శంఖ, చక్ర, హల(నాగలి),ముసల(రోకలి), పాశ, అంకుశ, వరద, అభయ హస్తాలతో ప్రకాశిస్తూ మనకు దర్శనం ఇస్తుంది...ఇది మహావారాహి(బృహద్వారాహి) యొక్క స్వరూపం...ఇంకా లఘువారాహి, స్వప్నవారాహి, ధూమ్రవారాహి, కిరాతవారాహిగా అమ్మ ఉపాసకుల పూజలు అందుకుంటుంది.
అమ్మవారి చిత్రాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే,ఆవిడ హలము (నాగలి), ముసలము (రోకలి) ధరించి కనిపిస్తుంది.నాగలిని భూమిని దున్నడానికి ఉపయోగిస్తే, రోకలిని ధాన్యం దంచడానికి వాడతారు. దీనిబట్టి అమ్మవారు సస్యదేవత అని గ్రహించాలి. అంటే పాడిపంటలను సమృద్ధిగా ఇచ్చే కల్పవల్లీ శ్రీ వారాహీ మాత.అందుకే అమ్మవారిని ఆషాఢ మాసంలో పూజించమన్నారు.నిజానికి రైతు గోఆధారిత వ్యవసాయం ద్వారా భూమిని శుద్ధి చేసి, సాగు చేస్తే అది కూడా ఒక రకమైన వారాహీ ఉపాసనే అవుతుంది.ఎందుకంటే వారాహీ అంటే ఎవరో కాదు సాక్షాత్తు భూమాత.
ఆషాఢ నవరాత్రి ప్రతి రోజూ, సప్త మాత్రుక దేవతలను మరియు అష్ట మాత్రుక దేవతలను పూజించడం, ఎనిమిదో రోజు వరాహి దేవిని పూజించడం వల్ల సంపన్నమైన జీవితం లభిస్తుంది.
ఆషాఢ నవరాత్రి 2023 తేదీలు
ఈ సంవత్సరం ఆషాఢ నవరాత్రులు June 19 Monday నుండి June 28th Wednesday ఉన్నవి.
Date: 19th June 2023, Monday
Tithi: Ashada Sukla Padyami
Tithi Time: Jun 18, 10:07 am - Jun 19, 11:25 am
Date: 20th une 2023, Tuesday
Tithi: Ashada Sukla Vidhiya
Tithi Time: Jun 19, 11:25 am - Jun 20, 1:07 pm
Date: 21st June 2023, Wednesday
Tithi: Ashada Sukla Tadiya
Tithi Time: Jun 20, 1:07 pm - Jun 21, 3:10 pm
Date: 22nd June 2023, Thursday
Tithi: Ashada Sukla Chavithi
Tithi Time: Jun 21, 3:10 pm - Jun 22, 5:28 pm
Date: 23rd June 2023, Friday
Tithi: Ashada Sukla Panchami
Tithi Time: Jun 22, 5:28 pm - Jun 23, 7:54 pm
Date: 24th June 2023, Saturday
Tithi: Ashada Sukla Shashti
Tithi Time: Jun 23, 7:54 pm - Jun 24, 10:17 pm
Date: 25th June 2023, Sunday
Tithi: Ashada Sukla Sapthami
Tithi Time: Jun 24, 10:17 pm - Jun 26, 12:25 am
Date: 26th June 2023, Monday
Tithi: Ashada Sukla Ashtami
Tithi Time: Jun 26, 12:25 am - Jun 27, 2:05 am
Date: 27th June 2023, Tuesday
Tithi: Ashada Sukla Navami
TithiTime: Jun 27, 2:05 am - Jun 28, 3:05 am
Date: 28th June 2023, Wednesday
Parana Time: After 05:56 AM
Tithi: Ashada Sukla Navami
TithiTime: Jun 28, 3:05 am - Jun 29, 3:19 am
Date: 19th June 2023, Monday
Tithi: Ashada Sukla Padyami
Tithi Time: Jun 18, 10:07 am - Jun 19, 11:25 am
Date: 20th une 2023, Tuesday
Tithi: Ashada Sukla Vidhiya
Tithi Time: Jun 19, 11:25 am - Jun 20, 1:07 pm
Date: 21st June 2023, Wednesday
Tithi: Ashada Sukla Tadiya
Tithi Time: Jun 20, 1:07 pm - Jun 21, 3:10 pm
Date: 22nd June 2023, Thursday
Tithi: Ashada Sukla Chavithi
Tithi Time: Jun 21, 3:10 pm - Jun 22, 5:28 pm
Date: 23rd June 2023, Friday
Tithi: Ashada Sukla Panchami
Tithi Time: Jun 22, 5:28 pm - Jun 23, 7:54 pm
Date: 24th June 2023, Saturday
Tithi: Ashada Sukla Shashti
Tithi Time: Jun 23, 7:54 pm - Jun 24, 10:17 pm
Date: 25th June 2023, Sunday
Tithi: Ashada Sukla Sapthami
Tithi Time: Jun 24, 10:17 pm - Jun 26, 12:25 am
Date: 26th June 2023, Monday
Tithi: Ashada Sukla Ashtami
Tithi Time: Jun 26, 12:25 am - Jun 27, 2:05 am
Date: 27th June 2023, Tuesday
Tithi: Ashada Sukla Navami
TithiTime: Jun 27, 2:05 am - Jun 28, 3:05 am
Date: 28th June 2023, Wednesday
Parana Time: After 05:56 AM
Tithi: Ashada Sukla Navami
TithiTime: Jun 28, 3:05 am - Jun 29, 3:19 am
ఈ దేవికి నిత్య పూజాతో పాటు వారాహి అష్టోత్తరం, వారాహి షోడశ నామాలతో కుంకుమార్చన చేసుకోండి. వీలయినవరు వారాహి యొక్క స్తోత్రాలు, హృదయం, కవచం, సహస్రనామలు, సహస్రనామము.. మొదలగు వాటిని పారాయణ చేసుకోవచ్చు.
తప్పకుండా వారాహి షోడశ నామా స్తోత్రం పఠిచండి.